నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి డైరెక్టర్ ఫిక్స్..? | nandamuri Mokshagna to be launched by Krish | Sakshi
Sakshi News home page

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి డైరెక్టర్ ఫిక్స్..?

Nov 30 2016 1:52 PM | Updated on Sep 4 2017 9:32 PM

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి డైరెక్టర్ ఫిక్స్..?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి డైరెక్టర్ ఫిక్స్..?

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి చాలా రోజులుగా రెడీ అవుతున్నాడు.

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి చాలా రోజులుగా రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడు.. ఎవరి దర్శకత్వంలో సెట్స్ మీదకు వెళ్లనుందన్న విషయంలో మాత్రం ఇంత వరకు క్లారిటీ రాలేదు. బాలయ్య వందో సినిమాలో మోక్షజ్ఞ అతిథి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరిగినా.. ఆ విషయంపై కూడా నందమూరి కుటుంబ సభ్యులు, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు.

అయితే తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీకి బాలకృష్ణ డైరెక్టర్ను ఫిక్స్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ సమయంలో క్రిష్ పనితీరు నచ్చిన బాలయ్య, అతని దర్శకత్వంలోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాను 2017 చివర్లోగాని 2018 మొదట్లో గాని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి, వారాహి చలనచిత్ర బ్యానర్పై రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement