చేసామ్‌ పెళ్లి | nagachaitanya, samantha wedding | Sakshi
Sakshi News home page

చేసామ్‌ పెళ్లి

Oct 8 2017 12:54 AM | Updated on Jul 14 2019 4:41 PM

nagachaitanya, samantha wedding - Sakshi

ఎవ్వరికి ఎవ్వరిని జతగా అనుకుంటాడో...ఆఖరికి వాళ్లనే ఓచోట కలిపేస్తాడు... పైవాడు! ‘ఏ మాయ చేసావె’లో చైతూ, సమంతల పెళ్లి సందర్భంలో వచ్చే పాటలోని పల్లవి ఇది. బహుశా... ‘ఏ మాయ చేసావె’ చిత్రదర్శకుడు గౌతమ్‌ మీనన్, ఆ పాట రాసిన అనంత శ్రీరామ్‌ కూడా అప్పుడు ఊహించి ఉండరేమో!? ‘నాగచైతన్య, సమంతలకు పైలోకంలో వాడు ఎపుడో ముడి వేశాడు’ అని! శుక్రవారం మూడుముళ్ల బంధంతో ఒక్కటైన చేసామ్‌ (చైతూ, సమంత) శనివారం బైబిల్‌ సాక్షిగా... ఉంగరాలు మార్చుకుని జీవితాంతం ఒకరికి తోడుగా మరొకరు ఉంటామని ప్రమాణం చేసుకున్నారు.

పాటలో చెప్పినట్టు ‘నింగీ నేలా గాలీ... నీరూ నిప్పూ అన్నీ... నిండు నూరేళ్లు జతగా ఉండమ’ని చైతూ, సమంతలను దీవించేశాయి! కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా! శుక్రవారం హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిన తర్వాత గోవాలోని హోటల్‌లోనే పార్టీ కూడా జరిగింది. అందులో చైతూ తండ్రి నాగార్జున, మేనమామ వెంకటేశ్‌ చేసిన సందడి హైలైట్‌గా నిలిచిందని ఆహుతులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కూడా పార్టీ మాంచి సందడిగా జరిగిందట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement