ట్రోలింగ్‌పై స్పందించిన మోహన్‌ బాబు

Mohan Babu Responds On Fasaak Trolling - Sakshi

గత కొద్ది రోజులుగా సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు ఇంటర్య్వూకు స్పందించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సీనియర్ జర్నలిస్ట్‌ రాజ్‌ దీప్‌ సర్దేశాయికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మోహన్‌ బాబు తన సినిమాకు సంబంధించిన సన్నివేశాన్ని ఇంగ్లీష్‌లో వివరించారు. ఈ సందర్భంగా ఆయన వాడిన ‘ఫసక్‌’ అన్న పదం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఈ పదానికి సంబంధించి చాలా స్పూఫ్‌ వీడియోలు కూడా నెట్‌ లో దర్శనమిస్తున్నాయి.

ఈ ట్రోలింగ్‌ను స్పోర్టివ్‌గా తీసుకున్న నటుడు మోహన్‌ బాబు ఆసక్తికరం‍గా స్పందించారు. ‘ఫసక్‌ అన్న పదం ట్రెండింగ్‌లో ఉన్నందుకు ఆనందంగా ఉంది. దాదాపు 200 వందల స్పూఫ్‌ వీడియోలు చేశారని విష్ణు చెప్పాడు. కొన్ని చూశాను. ఇన్నోవేటివ్‌గా.. ఫన్నీగా ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు మంచు ఫ్యామిలీ స్టార్స్‌ విష్ణు, మనోజ్‌, లక్ష్మీలు కూడా ఫసక్‌ (#fasak) హ్యాష్‌ ట్యాగ్‌తో ఆసక్తికర ట్వీట్‌లు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top