రజాకార్లపై పోరు!

రజాకార్లపై పోరు!


మరాఠీ చిత్రం ‘రజాకర్‌’ను నిర్మాత రాజమౌళి తెలుగులో ‘నైజాం సర్కరోడ’గా అనువదించారు. సిద్ధార్థ్‌ జాదవ్, జ్యోతి సుభాష్, శరద్‌ బుటాదియా ముఖ్య తారలుగా రాజ్‌దుర్గె దర్శకత్వం వహించారు. రాజమౌళి మాట్లాడుతూ – ‘‘దేశ స్వాతంత్య్రం తర్వాత హైదరాబాద్‌ను సొంతం చేసుకోవాలన్న రజాకార్లపై తిరుగుబాటు చేసిన ఓ యువకుడి కథాంశమే ఈ చిత్రం. సామాన్య పౌరుల అండతో ఆ యువకుడు రజాకార్లపై ఎలా పోరు జరిపాడన్నది ఆసక్తికరంగా తెరకెక్కించాం. మాటలు, పాటలు నేనే రాశా. మయురేష్‌ కేల్కర్‌ అందించిన పాటలు బాగున్నాయి. త్వరలో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top