రజాకార్ల దౌర్జన్యంపై... | Nizam Sarkaroda Movie Press Meet | Sakshi
Sakshi News home page

రజాకార్ల దౌర్జన్యంపై...

Apr 19 2017 11:50 PM | Updated on Sep 5 2017 9:11 AM

రజాకార్ల దౌర్జన్యంపై...

రజాకార్ల దౌర్జన్యంపై...

సిద్ధార్థ జాదవ్, జ్యోతి సుభాష్, జాకీర్‌ హుస్సేన్‌ ముఖ్య తారలుగా రాజు దుర్గే దర్శకత్వంలో మౌళి ఫిలింస్‌ పతాకంపై రాజమౌళి నిర్మించిన సినిమా ‘నైజాం సర్కరోడా’.

సిద్ధార్థ జాదవ్, జ్యోతి సుభాష్, జాకీర్‌ హుస్సేన్‌ ముఖ్య తారలుగా రాజు దుర్గే దర్శకత్వంలో మౌళి ఫిలింస్‌ పతాకంపై రాజమౌళి నిర్మించిన సినిమా ‘నైజాం సర్కరోడా’. మంగళవారం హైదరాబాద్‌లో ప్రదర్శించిన ఈ సినిమా ప్రివ్యూ షోకి ప్రజా గాయకుడు గద్దర్, ప్రొఫెసర్‌ కోదండరాం, పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. గద్దర్‌ మాట్లాడుతూ – ‘‘సామాన్య ప్రజలపై రజాకార్లు ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారన్న అంశాన్ని సినిమాలో చక్కగా చూపించారు.

 శత్రువును ఎదుర్కోవాలంటే చేతిలో ఆయుధమే ఉండాలా? మనలో శక్తి సామర్థ్యాలను ఆయుధంగా ఎందుకు మలుచుకోకూడదు? అనే అంశం బాగుంది’’ అన్నారు. ‘‘భారతదేశ చరిత్రలో హైదరాబాద్‌ విముక్తి పోరాటం ఓ అధ్యాయమైతే... అందులో సామాన్యుడు ఎదుర్కొన్న పరిస్థితులు మరో అధ్యాయం’’ అన్నారు రాజమౌళి. ‘‘చిన్నప్పటి నుంచి చూసిన పలు ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశా’’ అన్నారు దర్శకుడు రాజు దుర్గే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement