మరణశాసనం ట్రైలర్‌ విడుదల | Marana Sasanam Trailer Launch Roja, promotional | Sakshi
Sakshi News home page

మరణశాసనం ట్రైలర్‌ విడుదల

Sep 23 2013 2:30 AM | Updated on Sep 1 2017 10:57 PM

మరణశాసనం  ట్రైలర్‌ విడుదల

మరణశాసనం ట్రైలర్‌ విడుదల

ఆడవాళ్లకు ఏదైనా అన్యాయం జరిగితే సహించలేను. నా స్కూల్ డేస్‌లోనే ఇలాంటి అన్యాయాలను ఎదిరించేదాన్ని.

 ‘‘ఆడవాళ్లకు ఏదైనా అన్యాయం జరిగితే సహించలేను. నా స్కూల్ డేస్‌లోనే ఇలాంటి అన్యాయాలను ఎదిరించేదాన్ని. ప్రస్తుతం సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అన్యాయాల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రోజా. మలయాళ చిత్రం ‘మాస్టర్స్’ని ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై పాత్రికేయుడు నాగవర్మ సమర్పణలో జి. మధుకుమార్ తెలుగులో ‘మరణశాసనం’ పేరుతో విడుదల చేస్తున్నారు. శశికుమార్, పృథ్వీరాజ్, అనన్య, పియా బాజ్‌పాయ్, సంధ్య ముఖ్య తారలు. హైదరాబాద్‌లో ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌ను రోజా, ప్రచార చిత్రాన్ని బి. జయ ఆవిష్కరించారు. మధుకుమార్ మాట్లాడుతూ - ‘‘స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను అంతం చేయడానికి కొంతమంది యువతీ యువకులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నదే ఈ చిత్రం ప్రధానాంశం. వచ్చే నెల ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement