మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు | Mahesh Babu Say Thanks To Telangana Police For Fights Against Corona Virus | Sakshi
Sakshi News home page

మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు

Apr 9 2020 12:03 PM | Updated on Apr 9 2020 12:51 PM

Mahesh Babu Say Thanks To Telangana Police For Fights Against Corona Virus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి అలుపెరగని పోరాటం చేస్తున్న తెలంగాణ పోలీస్‌ శాఖకు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు గురువారం ట్వీట్‌ చేశాడు. ‘అత్యంత సవాలుతో కూడిన ఈ క్లిష్ట సమయంలో మమ్మల్ని అదేవిధంగా మా కుటుంబాల జీవితాలను, ఆరోగ్యాన్ని కాపాడుతున్నందుకు ధన్యవాదాలు. ప్రజలు, దేశం పట్ల మీ నిస్వార్థ సేవకి, అంకితభావానికి సెల్యూట్‌ చేస్తున్నా’అని మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశాడు. 

‘కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్దంలో అలుపెరగని పోరాటం చేస్తున్న తెలంగాణ పోలీసులకు హృదయపూర్వక ధన్యవాదాలు. కఠినమైన ఈ సమయంలో మీరు చేస్తున్న కృషి కచ్చితంగా అసాధరణమైనది’అంటూ మరో ట్వీట్‌లో మహేశ్‌ పేర్కొన్నాడు. ఇక కరోనాపై పోరాటంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ. కోటి విరాళం ప్రకటించి తన వంతు ఆర్థిక సాయం అందించాడు. అదేవిధంగా సినీ కార్మికుల కోసం మెగాస్టార్‌ చిరంజీవి ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ చారిటీకి రూ. 25 లక్షల విరాళం ఇచ్చి సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు మరోసారి తన గొప్పమనసును చాటుకున్న విషయం తెలిసిందే. 


చదవండి: 
‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన
అమ్మ అంత మాట ఎందుకు అన్నట్లు..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement