అజ్మీర్ దర్గాను సందర్శించిన మహేష్ బాబు

అజ్మీర్ దర్గాను సందర్శించిన మహేష్ బాబు


ప్రిన్స్ మహేష్ బాబు అజ్మీర్ దర్గాను సందర్శించారు. ఖ్వాజా మొయినుద్దీన్ చస్తీ వద్ద మహేష్ బాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ఆగడు రేపు విడుదల కానుంది. ఈ చిత్రం విజయవంతం కావాలని ఆయన ఆక్షాంకించారు. బిజినెస్మెన్, దూకుడు, వన్ నేనొక్కడినే చిత్రాలలో హీరోగా నటించిన మహేష్ బాబు విడుదలకు ముందు ఈ దర్గాను సందర్శించారు.


14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆగడు చిత్రం రూపొందింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. గతంలో వీరి కాంబినేషన్లో దూకుడు చిత్రం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రేపు విడుదలకానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top