కొందరికి నోటీసులు రావడం నిజమే : మా అధ్యక్షుడు | Maa president Sivaji raja response on Drugs case | Sakshi
Sakshi News home page

కొందరికి నోటీసులు రావడం నిజమే : మా అధ్యక్షుడు

Jul 14 2017 2:27 PM | Updated on May 25 2018 2:11 PM

కొందరికి నోటీసులు రావడం నిజమే : మా అధ్యక్షుడు - Sakshi

కొందరికి నోటీసులు రావడం నిజమే : మా అధ్యక్షుడు

తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు పై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. 15 మందికి పైగా సినీ సెలబ్రిటీలకు

తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు పై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. 15 మందికి పైగా సినీ సెలబ్రిటీలకు నోటీసులు అందాయన్న వార్తతో ఇండస్ట్రీ ఎలర్ట్ అయ్యింది. అయితే నోటీసులు వచ్చిన వారితో పాటు కొంత మంది నోటీసులు రానివారి పేర్లు కూడా మీడియాలో వినిపిస్తుండటంపై సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై స్పందించిన మా అధ్యక్షుడు శివాజీ రాజా,  ఇండస్ట్రీలో కొంతమందికి నోటీసులు రావటం వాస్తవమే, అయితే నోటీసులు రాని వారి పేర్లు కూడా మీడియాలో వినిపిస్తుండటం బాధాకరం అన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించడంలో తప్పులేదు, కానీ చేయని వారిని నిధించటం సరికాదు, నోటీసులు అందిన వారి పేర్లను వేసే విషయంలో మీడియా సంయమనం పాటించాలని కోరారు శివాజీ రాజా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement