‘సాహో’తో మళ్లీ వస్తున్నాడోచ్‌! | Lal to join Prabhas' Sahoo | Sakshi
Sakshi News home page

‘సాహో’తో మళ్లీ వస్తున్నాడోచ్‌!

Sep 18 2017 1:07 AM | Updated on Jul 17 2019 10:14 AM

‘సాహో’తో మళ్లీ వస్తున్నాడోచ్‌! - Sakshi

‘సాహో’తో మళ్లీ వస్తున్నాడోచ్‌!

లాల్‌... మలయాళంలో మంచి పేరున్న నటుడీయన. రచయిత కూడా! ఈయనకు ప్రభాస్‌ అండ్‌ టీమ్‌ నుంచి కబురు వెళ్లింది.

లాల్‌... మలయాళంలో మంచి పేరున్న నటుడీయన. రచయిత కూడా! ఈయనకు ప్రభాస్‌ అండ్‌ టీమ్‌ నుంచి కబురు వెళ్లింది. మేటర్‌ ఏంటంటే... ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సాహో’లోని ఓ కీలక పాత్రలో నటించమని అడిగితే, లాల్‌ వెంటనే ఓకే చెప్పేశారట. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘సాహో’ షూటింగులో త్వరలో లాల్‌ పాల్గొంటారని సమాచారం.

అన్నట్టు... తెలుగు తెరపై ఈయన కనిపించనున్న మూడో చిత్రమిది. అంతకు ముందు పవన్‌ కల్యాణ్‌ ‘అన్నవరం’, రవితేజ ‘ఖతర్నాక్‌’ సిన్మాల్లో విలన్‌గా చేశారు. ‘సాహో’లోనూ ఈయనది విలన్‌ పాత్రేనట! సుమారు 11 ఏళ్ల తర్వాత ‘సాహో’తో మళ్లీ విలన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు లాల్‌ వస్తున్నారన్న మాట! ఇప్పుడీయన చేయబోయే పాత్రకు ముందు మోహన్‌లాల్‌ను అనుకున్నారట! మరి ఏమైందో? చివరకు, ఈయన వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement