వరుసగా మూడు ఘనవిజయాలు సాధించిన దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబు హీరో భరత్ అనే నేను సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను ప్రారంభించాడు. అయితే ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తుంది.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రంగస్థలం తరువాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని భావించినా.. చరణ్ బోయపాటితో మరో సినిమాను ప్రారంభించాడు. ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందన్న ప్రచారం జరిగినా జూనియర్ ఇప్పట్లో డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో మరో హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడట కొరాటల శివ. చరణ్ తో కాకపోయినా.. మరో మెగా హీరో అల్లు అర్జున్ హీరోగా కొరటాల ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.
ప్రస్తుతం వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న నాపేరు సూర్య నా ఇళ్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు బన్నీ. ఈసినిమా తరువాత తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి బన్నీ ముందుగా లింగుసామికి ఛాన్స్ ఇస్తాడా..? లేక కొరటాలతో సినిమాకు రెడీ అవుతాడా చూడాలి.