కొండారెడ్డి బురుజు సెంటర్‌లో...

Kondareddy Buruju recreated for Sarileru Neekevvaru - Sakshi

‘ఒక్కడు’ సినిమాలో కొండా రెడ్డి బురుజు సెంటర్‌లో ప్రకాష్‌ రాజ్‌తో ఫైట్‌ చేశారు మహేశ్‌బాబు. ఆ సినిమాలో ఆ సీన్‌ ఓ హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి అదే సెంటర్‌లో అడుగుపెట్టారు మహేశ్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మికా మందన్నా కథానాయిక. ‘దిల్‌’ రాజు, అనిల్‌ సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కోసం కర్నూల్‌లో ఫేమస్‌ కొండారెడ్డి బురుజు సెంటర్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్‌ వేశారు. సుమారు 4కోట్ల వ్యయంతో ఈ సెట్‌ను వేశారని తెలిసింది.  ఆ సెట్‌లోనే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. రాజేంద్రప్రసాద్, మహేశ్‌బాబు మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో విజయ శాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top