విజయ్‌, విక్రమ్‌ లాంటి వాడు కావాలి : కీర్తి సురేష్‌ | Keerthy Suresh Opens Up About Marriage | Sakshi
Sakshi News home page

Dec 30 2018 10:11 AM | Updated on Dec 30 2018 10:11 AM

Keerthy Suresh Opens Up About Marriage - Sakshi

యువతులు తమకు కాబోయే భర్త ఎలా ఉండాలో అని కలల్లో ఊహించుకుంటారు. ఇక సినీ తారలు తామూ సాటి అమ్మాయిలమే అని, నటన అన్నది వృత్తి మాత్రమే అనే విషయాన్ని చాలా మంది చాలా సార్లు వ్యక్తం చేశారు. హీరోయిన్లు తమకు కాబోయే జీవిత భాగస్వాములు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని కలలు కంటుంటారు. నటి కీర్తీసురేశ్‌ ఇందుకు అతీతం కాదు. సినీ వారసత్వం నుంచి వచ్చిన కీర్తీసురేశ్‌ మూడు నాలుగేళ్లలోనే వరుసగా చిత్రాలు చేసేసింది.

అనూహ్యంగా విజయ్, విక్రమ్, సూర్య, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో జత కట్టేసింది. ఇక నడిగైయార్‌ తిలగం (తెలుగులో మహానటి) చిత్రంలో సావిత్రిగా జీవించి ప్రశంసలు అందుకుంది. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో నటించబోతుందన్న వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు కొన్ని నెలలు విశ్రాంతి తీసుకోనున్నానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. రాజమౌళి చిత్రం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడానికే ఈ గ్యాప్‌ను తీసుకుందేమోననే ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో ప్రస్తుతం ఒక మలయాళ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల ఈ బ్యూటీ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చింది. ఈ సందర్భంగా పెళ్లి గురించి ప్రశ్నించగా.. ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేసింది. ప్రేమ వివాహం చేసుకుంటారా? లేక పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్నకు అది కూడా ఇప్పుడు చెప్పలేనంది. అయితే ఒక వేళ ఎవరినైనా ప్రేమిస్తే ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో అభ్యంతరం చెప్పరని చెప్పింది. ఎలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు మాత్రం టక్కున తనకు నటుడు విజయ్, విక్రమ్‌ లాంటి భర్త రావాలని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement