
రజనీకాంత్ సరసన?
ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లు... అసలు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘రోబో 2’ సినిమా ఉంటుందా?
ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లు... అసలు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘రోబో 2’ సినిమా ఉంటుందా? లేదా? అనే విషయమే ఇంకా స్పష్టం కాలేదు. అప్పుడే ఈ చిత్రంలో రజనీ సరసన నటించబోయే కథానాయిక ఎవరు? అనే విషయమై చెన్నయ్‌లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. సూపర్ స్టార్ సరసన కత్రినా కైఫ్‌ని కథానాయికగా తీసుకున్నారన్నది ఆ చర్చల సారాంశం. రజనీ నటించిన ‘కొచ్చాడయాన్’లో కత్రినాను తీసుకోవాలనుకున్నారనీ, కానీ తేదీలు లేక ఆమె అంగీకరించలేదనీ అప్పట్లో ఓ వార్త ప్రచారమైంది. ఈ ‘రోబో 2’ విషయమై ఇటీవల కత్రినాను శంకర్ సంప్రతించారట. ఇప్పుడు మాత్రం రజనీ సరసన నటించడం కోసం కత్రినా తన డైరీ చెక్ చేసి మరీ, తేదీలు కేటాయించే ప్రయత్నం మీద ఉన్నారట.