అవార్డులు, డబ్బుల కోసమే అక్కడికి వెళ్తున్నా.! | karan Johar go to award ceremonies for award or money | Sakshi
Sakshi News home page

అవార్డులు, డబ్బుల కోసమే అక్కడికి వెళ్తున్నా.!

Dec 24 2016 1:43 PM | Updated on Sep 4 2017 11:31 PM

అవార్డులు, డబ్బుల కోసమే అక్కడికి వెళ్తున్నా.!

అవార్డులు, డబ్బుల కోసమే అక్కడికి వెళ్తున్నా.!

2017 జియో ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రెస్ మీట్కు హాజరైన కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడిగా, నిర్మాతగా ఉన్న కరణ్ అవార్డు వేడుకలకు అక్కడ ఇచ్చే డబ్బు,

2017 జియో ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రెస్ మీట్కు హాజరైన కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడిగా, నిర్మాతగా ఉన్న కరణ్ అవార్డు వేడుకలకు అక్కడ ఇచ్చే డబ్బు, అవార్డు కోసమే వెళుతున్నానని ప్రకటించాడు. అయితే బాలీవుడ్ ఆమిర్ ఖాన్, కంగనా రనౌత్ కొంత మంది నటులు మాత్రం ఇలాంటి వేడుకల దూరంగా ఉంటున్నారని అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని తెలిపాడు.

' నేను మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే అన్ని వేడుకలకు హాజరువుతున్నా.. అక్కడ ఇచ్చే అవార్డు, డబ్బు కోసమే నేను ఆ వేడుకలకు హాజరవుతున్నా. కానీ ఫిలిం ఫేర్ విషయంలో మాత్రం వేరు. ఇది ఒక చరిత్ర అన్న నమ్మకంతోనే ఈ వేడుకల్లో పాల్గొంటున్నా' అని తెలిపారు. ఎన్నో రకాల అవార్డు ఫంక్షన్లు నిర్వహిస్తున్న కారణంగా ఈ ఫంక్షన్స్పై ఆసక్తి తగ్గిపోతుందని తెలిపారు.

 

అయితే టీవీ ఛానల్స్, ఈ వేడులను ప్రొత్సహించటం వెనక కూడా చాలా కారణాలున్నాయన్నాడు కరణ్. తమకు నచ్చిన స్టార్స్ అందరినీ ఒకే వేదిక మీద చూసేందుకు అభిమానులు ఇష్టపడతారు. అందుకే టీవీ ఛానల్స్ ఈ ప్రసరాల ద్వారా లాభం పొందుతున్నాయి. ఈ కారణాల మూలంగానే అవార్డు ఫంక్షన్లలో పాల్గొనాలా లేక వాటికి దూరంగా ఉండాలా..? అన్న విషయాలను స్టార్స్ తేల్చుకోలేకపోతున్నారన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement