‘రాజకీయాలా.. ఇంకా అంత వయసు రాలేదు’ | Kangana Ranaut Said Narendra Modi Should Be PM For Next 5 Years | Sakshi
Sakshi News home page

‘రాజకీయాలా.. ఇంకా అంత వయసు రాలేదు’

Jul 30 2018 10:59 AM | Updated on Aug 21 2019 10:25 AM

Kangana Ranaut Said Narendra Modi Should Be PM For Next 5 Years - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్‌ఫోటో)

మోదీ  పాలన అమోఘంగా ఉంది. 2019లో కూడా  ఆయనే విజయం సాధించాలి

ఫైర్‌ బ్రాండ్‌, ముక్కుసూటితనం ఆఖరికి పొగరు అనుకున్న ఇవేవి పట్టించుకోరు కంగనా రనౌత్‌. తనకు ఏం మాట్లాడలనిపిస్తే అదే మాట్లాడతారు. అది కూడా కుండ బద్దలు కొట్టినట్లు . ఇప్పుడు రాజకీయాల గురించి కూడా ఇలాంటి స్టెట్‌మెంటే ఇచ్చారు కంగనా. ప్రధాని నరేంద్ర మోదీ బాల్యం, యవ్వనాల ఆధారంగా ‘చలో జీతే హై’ షార్ట్‌ ఫిలిం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలీవుడ్‌ ప్రముఖులుకు ప్రత్యేక షో వేశారు. అక్షయ్‌ కుమార్‌, గుల్షన్‌ గ్రోవర్‌, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్లతోపాటు కంగనా కూడా ఈ ప్రిమీయర్‌ షోకు హాజరయ్యారు.

అనంతరం నేటి రాజకీయాల గురించి అడగ్గా కుటుంబ పాలనపై విమర్శించలు గుప్పిండమే కాక ప్రధాని నరేంద్ర మోదీని తెగ అభినందించారు.  ‘కేవలం తన కుటుంబం పేరు చెప్పుకుని మోదీ ఇక్కడ దాక రాలేదు. ఇందుకోసం ఆయన ఎంతో శ్రమించారు. ఆయన ప్రధాని కావడం చాలా సమంజసం. మోదీ ఇక్కడకు చేరడానికి ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు దేశం కోసం కూడా అంతే కష్ట పడుతున్నారు. మోదీ  పాలన అమోఘంగా ఉంది. అలాంటి వ్యక్తికి ఐదేళ్ల పాలనా కాలం సరిపోదు. 2019లో కూడా  ఆయనే విజయం సాధించాలని’ కోరుకుంటున్నట్లు తెలిపారు. 

అంతేకాక గత కొన్ని రోజులుగా కంగనా  రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలపై జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ విషయం గురించి కంగనాను ‘మీ రాజకీయరంగ ప్రవేశం ఎప్పుడు?’ అని అడగ్గా తనకింకా తగిన వయసు రాలేదనీ, తగిన సమయం కూడా అవసరమని అనడంతో వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేసినా ఆశ్చర్యం లేదని రాజ కీయ పరిశీలకులు భావిస్తు న్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement