తగ్గేది లేదు! | Kamal Haasan walks that extra mile for Indian-2 | Sakshi
Sakshi News home page

తగ్గేది లేదు!

Oct 21 2018 12:23 AM | Updated on Oct 21 2018 9:32 AM

Kamal Haasan walks that extra mile for Indian-2 - Sakshi

పాత్రకు అనుగుణంగా మారిపోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు కమల్‌హాసన్‌. అందుకే స్క్రీన్‌ మీద మనకు కమల్‌హాసన్‌ కాకుండా ఆయన పోషించే పాత్రలే కనిపిస్తాయి. ఇప్పుడు మరోసారి తన కొత్త సినిమా పాత్రలోకి మారడానికి శిక్షణ  మొదలుపెట్టేశారట. దర్శకుడు శంకర్, కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘ఇండియన్‌’ (భారతీయుడు). ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ ‘ఇండియన్‌ 2’ (భారతీయుడు 2) తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కమల్‌హాసన్‌ సరికొత్త అవతారంలో కనిపిస్తారట. ఆ లుక్‌ కోసం అమెరికన్‌ ట్రైనర్‌ శిక్షణలో బాడీ మీద వర్కౌట్‌ చేయనున్నారట కమల్‌.

ఆ మధ్య జరిగిన మోకాలు సర్జరీ వల్ల కొంచెం వెయిట్‌ పెరిగారు కమల్‌. ఈ సినిమాలో ఫుల్‌ ఫిట్‌గా కనిపించడం కోసమే ఈ ట్రైనింగ్‌. ఇందుకోసం రెండు నెలలు శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టనున్నారట. ఎంత కష్టమైనా ఫర్వాలేదు.. వెనక్కి తగ్గేది లేదు అని సన్నిహితులతో కమల్‌ అన్నారట. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెంబర్‌ నుంచి స్టార్ట్‌ కానుందని సమాచారం. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ విలన్‌గా కనిపించనున్న ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తారట. ఈ చిత్రం 2020లో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement