విశ్వాసానికి కంగ్రాట్స్‌

Kajal Romance With Ajith Again.? - Sakshi

తమిళసినిమా: విశ్వాసానికి కంగ్రాట్స్‌ అని చెప్పేసింది నటి కాజల్‌అగర్వాల్‌. ఆ కథేంటి అనేగా మీ ఆసక్తి. అక్కడికే వస్తున్నాం. వివేగం వంటి విజయవంతమైన తరువాత నటుడు అజిత్‌ తాజా చిత్రానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి విశ్వాసం అనే టైటిల్‌ని కూడా నిర్ణయించేశారు. దీన్ని వివేగం చిత్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్‌ నిర్మించనుంది. అజిత్‌తో వీరం, వేదాళం, వివేగం చిత్రాలను తెరకెక్కించిన శివనే దర్శకత్వం వహించనున్నారు. యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఒక్కడి వరకూ అంతా సవ్యంగానే ఉంది. ఇందులో నాయకి ఎవరన్నదే ఆసక్తిగా మారింది. విశ్వాసంలో నటించే హీరోయిన్‌ పాత్రకు చాలా మంది క్రేజీ నటీమణుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తమన్నా, అనుష్క,  కీర్తీసురేశ్‌ ఇలా పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తున్నాయి.

వీరిలో కీర్తీసురేశ్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న తరుణంలో తాజాగా అనుష్క పేరు ఖరారైందనే టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని చిత్ర వర్గాలు అదంతా అసత్య ప్రచారం అని తోసిపుచ్చాయి. నిజానికి హీరో అజిత్, దర్శకుడు శివ, సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌రాజా మాత్రమే ఇప్పటికీ విశ్వాసం చిత్రం కోసం ఎంపిక అయ్యారని వివరించారు. హీరోయిన్‌ ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని తెలిపారు.  ఇలాంటి తరుణంలో కాజల్‌ అగర్వాల్, అజిత్‌ తాజా చిత్రం గురించి తెలుసుకుని వెంటనే విశ్వాసం చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్‌ అని తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసింది. ఇది ఇప్పడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాజల్‌ అజిత్‌తో వివేగం చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మళ్లీ విశ్వాసంలో నటిం చాలనే ఆసక్తితోనే కాజల్‌ కంగ్రాట్స్‌ చెప్పిందనే ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top