వ్రతం చెడ్డా దక్కని ఫలితం | kajal agrwal worry about bollywood movie offers | Sakshi
Sakshi News home page

వ్రతం చెడ్డా దక్కని ఫలితం

Jan 26 2016 3:07 AM | Updated on Apr 3 2019 6:23 PM

వ్రతం చెడ్డా  దక్కని ఫలితం - Sakshi

వ్రతం చెడ్డా దక్కని ఫలితం

వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదని నటి కాజల్ అగర్వాల్ చింతలో మునిగిపోయిందని కోలీవుడ్ వర్గాలు కథనాలు వండుతున్నాయి.

వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదని నటి కాజల్ అగర్వాల్ చింతలో మునిగిపోయిందని కోలీవుడ్ వర్గాలు కథనాలు వండుతున్నాయి. నిజానికి ఈ ఉత్తరాది భామకు దక్షిణాదిలో అవకాశాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం కోలీవుడ్ దృష్టి ఈ బ్యూటీపై పడింది. అలాంటిది ఈ అమ్మడి చింత దేనికనేగా మీ ప్రశ్న. విషయం ఏమిటంటే దక్షిణాదిలో ప్రముఖ నాయికలుగా పేరు తేచ్చుకున్న నటీమణులకు ఉత్తరాదిలో రాణించాలన్న ఆశ పెద్దగా తీరడం లేదు.
 
  శ్రీదేవి, జయప్రదలాంటి అతి కొద్ది మంది తారలే బాలీవుడ్‌లోనూ తమ సత్తా చాటుకున్నారు. శ్రీయ, త్రిష, ఇలియానా, కాజల్ లాంటి దక్షిణాది అగ్ర కాథానాయికల బాలీవుడ్ ప్రయత్నాలు అక్కడ పారలేదు. నటి అశిన్ కూడా భారీ హిట్‌లో రంగ ప్రవేశం చేసినా ఆ ప్రభావం కొంత వరకే పని చేసింది. అవకాశాలు తగ్గు ముఖం పట్టడంతో ఇటీవలే ప్రేమికుడు రాహుల్ శర్మను పెళ్లి చేసుకున్నారు. కాగా నటి కాజల్‌అగర్వాల్ మాత్రం ట్రై అండ్ ట్రై అన్న చందాన తన బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
 
  ఇటీవల ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ అందాలారబోస్తూ ధరించిన దుస్తులతో హల్‌చల్ చేసే ప్రయత్నం చేసింది. అలా బాలీవుడ్ దృష్టిని తన వైపు తిప్పుకోవాలని ఆశించింది. అయితే అక్కడ మీడియా గానీ, సినీ వర్గాలు గానీ కాజల్ శృతి మించిన గ్లామర్ భంగిమలను అస్సలు పటించుకోలేదట. దీంతో వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదని అమ్మడు తెగ ఇదైపోతోందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement