నా వయసును దాచను : కాజల్‌ | Kajal Aggarwal Doesnt Want to Hide Her Real Age | Sakshi
Sakshi News home page

నా వయసును దాచను : కాజల్‌

Feb 24 2019 10:22 AM | Updated on Aug 8 2019 11:13 AM

Kajal Aggarwal Doesnt Want to Hide Her Real Age - Sakshi

నేను చాలా పరిణితి చెందాను అంటోంది నటి కాజల్‌ అగర్వాల్‌.  అంతే కాదు ఈ అమ్మడు తన గురించి ఇంకా చాలానే చెప్పుకొచ్చారు. నటిగా వయసు 10 ఏళ్లు, చిత్రాలు 50. అనుభవం మాత్రం 30 ఏళ్లు. ఇది కాజల్‌నే స్వయంగా చెప్పుకున్నారు. నిజమే కథానాయకిగా 10 ఏళ్లు రాణించడం, అదీ క్రేజ్‌ తగ్గకుండా, మార్కెట్‌ను కాపాడుకోవడం అంత సులభమైన విషయం కాదు. అలా రాణిస్తున్న అతి కొద్దిమంది నటీమణుల్లో కాజల్‌అగర్వాల్‌ ఒకరు. ఇప్పటికీ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తున్నారు. ముఖ్యంగా విశ్వనటుడు కమలమాసన్‌తో స్టార్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌–2 చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న లక్కీ నటి కాజల్‌.

హిందీలో కూడా నటిస్తూ బిజీగా ఉన్న కాజల్‌ అగర్వాల్‌ ఒక ఇంటర్వ్యూలో ఏ రంగంలోనైనా మహిళలను మీ వయసు ఎంత? అని అడిగితే చెప్పడానికి సందేహిస్తారని, ముఖ్యంగా కథానాయికలు అసలు చెప్పరని అన్నారు. అయితే తాను అలా కాదని, తన వయసును దాచనని చెప్పారు. సినిమాల్లో తక్కువ వయసుగా కనిపించడానికి కథానాయికలు చాలా కష్టపడుతుంటారని చెప్పారు. తన వయసు పెరుగుతోందని చింతించనని, అది పెరిగిన కొద్దీ పరిణితి పెరుగుతుందని పేర్కొన్నారు.

నిజ జీవితంలో తాను తన వయసును 10 ఏళ్లు ఎక్కువ చెప్పడానికి రెడీ అన్నారు.ఈ కాలంలో ప్రతిభావంతులైన నటులతో నటించి చాలా నేర్చుకున్నానని, నటిగా పదేళ్లలో సినిమా రంగం తనకు చాలా నేర్పిందని, ఇతర ఏరంగంలోనూ అంత అనుభం రాదని అన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ పదేళ్లతో 30 ఏళ్ల అనుభవాన్ని పొందానని, ఎలాంటి సమస్య వచ్చినా, పరిష్కరించగలిగే పరిపక్వత వచ్చిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement