'ఈ నగరానికి ఏమైంది' అంటున్న వెంకీ

Teja Venkatesh

సీనియర్ హీరో వెంకటేష్ ఈ మధ్య ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. సినిమా సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా రామానాయుడు మరణం తరువాత గురు సినిమా మాత్రమే చేసిన వెంకీ.. మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకొని తేజ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు. సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. రానా హీరో నేను రాజు నేనే మంత్రి లాంటి భారీ హిట్ సాధించిన తేజ మరోసారి అదే బ్యానర్ లో అదే ఫ్యామిలీ హీరోతో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకు ఓ ఆసక్తికరమైన టైటిల్ ఫైనల్ చేశారన్న వార్త వినిపిస్తోంది. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఫిలిం ఛాంబర్ లో 'ఈ నగరానికి ఏమైంది..?' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. దీంతో ఈ టైటిల్ వెంకీ, తేజ ల సినిమాకే అన్న ప్రచారం మొదలైంది. వెంకటేష్ సినిమాతోపాటు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలోనూ మరో సినిమాను కూడా నిర్మిస్తోంది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మరి ఈ రెండింటిలో ఈ ఆసక్తికర టైటిల్ ఏ సినిమాకు ఫిక్స్ చేస్తారో చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top