నరేశ్ కథల ఏటీఎం - దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి

నరేశ్ కథల ఏటీఎం - దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి


‘‘ప్రసాద్‌గారితో సినిమా అనుకున్నప్పుడు నరేశ్‌తో చేద్దామనుకున్నాం. ‘మన కాంబినేషన్‌లో మూడో సినిమా కాబట్టి, డిఫరెంట్‌గా ఉండాలి. హారర్ జోనర్ ఎందుకు ట్రై చేయకూడదు?’ అని నరేశ్ అన్నాడు. కొత్తగా ఉంటుందని ముందుకెళ్లాం. నరేశ్ ఒక కథల ఏటీఎం. కథాచర్చల్లో నేనో కథ చెబితే తను ఆరు చెప్పేవాడు’’ అని జి.నాగేశ్వరరెడ్డి అన్నారు. ‘అల్లరి’ నరేశ్, కృతిక, మౌర్యానీ ముఖ్య తారలుగా నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.నరేశ్ మాట్లాడుతూ-‘‘సీమశాస్త్రి’, ‘సీమ టపాకాయ్’ వంటి కామెడీ మూవీస్ చేసిన నాకు, నాగేశ్వరరెడ్డికీ హారర్ జానర్ కొత్తే. అయినా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో చేశాం. రాజేంద్రప్రసాద్‌గారి నుంచి ఈ చిత్రంతో మరింత నేర్చుకున్నా. ఈ నెల 11న ఈ చిత్రం విడుదలవుతుంది’’ అన్నారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, కృతిక, మౌర్యాని, హీరోలు నాని, సుధీర్‌బాబు, నవీన్ చంద్ర, వరుణ్ సందేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top