రజనీ, కమల్‌కు మద్దతివ్వను!

Im Not Support To Rajini And Kamal Said Prakash Raj - Sakshi

నటుడు ప్రకాశ్‌రాజ్‌

పెరంబూరు: రజనీకాంత్, కమల్‌ హాసన్‌లకు మద్దతివ్వనని పేర్కొన్నారు నటుడు ప్రకాశ్‌రాజ్‌. ఈయన తరచూ రాజకీయాలపై స్పందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారతీయ జనతాపార్టీపై తనదైన శైలిలో దండెత్తుతున్నారు. ఇటీవల తాను నటించిన 60 వయదు మణిరం చిత్ర విలేకరుల సమావేశం సందర్భంగా ఆయన ఒక భేటీలో మాట్లాడారు. ప్రజాసేవకు రాజకీయాల్లోకి రావలసిన అవసరం లేదన్నారు. ప్రజల వైపు ఉంటూ పోరాడుతూ సమస్యలను ప్రశ్నిస్తున్న తాను ఎప్పుడో రాజకీయాల్లోకి ప్రవేశించేవాడినన్నారు.

తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణాలో పది ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. రజనీ, కమల్‌హాసన్‌ రాజకీయ రంగప్రవేశంపై మాట్లాడుతూవారు మంచి ఉద్దేశంతోనే రంగప్రవేశం చేశారన్నారు. ప్రజల ఆదరణ బట్టి వారి భవిష్యత్‌ ఉంటుందన్నారు. వారికి మద్దతివ్వాలన్న నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో రానని, ప్రజల సమస్యలపై ప్రశ్నించడం కూడా రాజకీయ సేవేనని ఆయన చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top