అలియాతో జతకట్టడం ఆనందంగా ఉంది:సల్మాన్ ఖాన్ | I was proud to share the stage with alia bhatt:salman khan | Sakshi
Sakshi News home page

అలియాతో జతకట్టడం ఆనందంగా ఉంది:సల్మాన్ ఖాన్

Jan 11 2014 3:02 PM | Updated on Sep 2 2017 2:31 AM

అలియాతో జతకట్టడం ఆనందంగా ఉంది:సల్మాన్ ఖాన్

అలియాతో జతకట్టడం ఆనందంగా ఉంది:సల్మాన్ ఖాన్

మహేష్ భట్ కుమార్తె అలియా భట్ తో సైఫాయ్ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు.

ముంబై: మహేష్ భట్ కుమార్తె అలియా భట్ తో సైఫాయ్ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో అలియాతో జతకట్టడం సంతోషంగా ఉందని తెలిపాడు. బాలీవుడ్ తారలు మాధురీ దీక్షిత్, ఎల్లి ఆవ్రామ్, జరైన్ ఖాన్ లతో పాటు అలియా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది.. ఈ కార్యక్రమం కాస్తా రాజకీయ విమర్శలకు దారి తీసింది. సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు చోటు చేసుకున్నాయి.

 

ఈ నేపథ్యంలో మహేష్ భట్ కూడా అలియా ఇందులో పాల్గొనడంపై విచారం వ్యక్తం చేశారు. కాగా, సల్మాన్ ఖాన్ ఆమెను వెనుకేసుకొచ్చాడు. ఆమె తండ్రి మహేష్ భట్ సైఫాయ్ కు ఎటువంటి క్షమాపణలు కు చెప్పాల్సిన అవసరం లేదని ట్వీట్టర్ లో పేర్కొన్నాడు. ఆమె కష్టపడే విధానం బాగుందని తెలిపాడు. ఇదిలా ఉండగా తారలు కార్యక్రమాలకు హాజరైయ్యే ముందు వాటి పూర్వపరాలను తెలుసుకోవడం మంచిదని పూజాభట్ తెలిపారు.
 

 సైఫాయ్ మహోత్సవ వార్షిక కార్యక్రమంలో సల్మాన్, మాధురీలతోపాటు సోహా ఆలీ ఖాన్, రణ్ వీర్ సింగ్ ఇతర బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. ములాయం సింగ్ యాదవ్ మేనల్లుడు స్మృతికి చిహ్నంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో సినీ తారలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, మంత్రులు, అధికారులు పాలుపంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement