'హేట్ స్టోరీ -2' శృంగార చిత్రం కాదు! | 'Hate Story 2' not an erotic thriller: Jay Bhanushali | Sakshi
Sakshi News home page

'హేట్ స్టోరీ -2' శృంగార చిత్రం కాదు!

Jul 7 2014 4:07 PM | Updated on Apr 3 2019 6:23 PM

త్వరలో విడుదల కానున్న 'హేట్ స్టోరీ-2 శృంగార భరిత చిత్రం కాదని ఆ చిత్ర హీరో జయ్ భానుశాలీ(29) స్పష్టం చేశాడు.

ముంబై:త్వరలో విడుదల కానున్న 'హేట్ స్టోరీ-2 శృంగార భరిత చిత్రం కాదని ఆ చిత్ర హీరో జయ్ భానుశాలీ(29) స్పష్టం చేశాడు. ఈ చిత్ర ట్రయలర్ లో భాగంగా విడుదల చేసిన కొన్ని సన్నివేశాలపై ఆరోపణలు రావడంతో ఆ నటుడు స్పందించాడు. ఆ చిత్రం శృంగార భరిత చిత్రం కాదన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన భానుశాలీ.. 'నేను నిజం చెబుతున్నాను. ముందు వచ్చిన హేట్ స్టోరీకి, ఈ సినిమాకు సంబంధం లేదు. అసలు ఆ చిత్రానికి ఈ చిత్రానికి పొంతనే ఉండదు. ఈ సినిమాకు ఓ కథ ఉంది. ఆ కథాపరంగానే చిత్రీకరణ జరిగింది' అని తెలిపాడు. అందులో ఒక పాట తరువాత వచ్చే ఒక సన్నివేశం తప్పితే మిగతా సినిమా అంతా మామూలు సినిమాలానే ఉంటుందన్నాడు. ఈ చిత్రంలోని పది సన్నివేశాల్లో ఒకటి శృంగార పరమైన సన్నివేశం ఉంటే తప్పేంటని ప్రశ్నించాడు.

 

ఇక్కడ తొమ్మిది మంచి విషయాలు ఉంటే.. ఏదో ఉందని  భూతద్దంలో చూపడం తగదన్నాడు. ఆ విషయాన్ని తప్పకుండా సినిమా చూసిన తరువాత ప్రజలే ఒప్పుకుంటారని భానుశాలీ పేర్కొన్నాడు. ఈ చిత్రాన్ని జూలై 18వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement