నూతన సంబరం న్యూయార్క్ లో | Hansika new year party in new york | Sakshi
Sakshi News home page

నూతన సంబరం న్యూయార్క్ లో

Dec 23 2013 4:08 AM | Updated on Oct 17 2018 4:36 PM

నూతన సంబరం న్యూయార్క్ లో - Sakshi

నూతన సంబరం న్యూయార్క్ లో

సంచలన తారల పట్టికలో నటి హన్సిక చేరి చాలా కాలం అయ్యింది. వరుస విజయాలతో ముందంజలో ఉన్న ఈ బ్యూటీకి తాజాగా బిరియాని

 సంచలన తారల పట్టికలో నటి హన్సిక చేరి చాలా కాలం అయ్యింది. వరుస విజయాలతో ముందంజలో ఉన్న ఈ బ్యూటీకి తాజాగా బిరియాని చిత్రం ద్వారా మరో సక్సెస్ కూడా చేరింది. ఈ ఏడాది అంతా చిత్రాల షూటింగ్‌లతో యమ బిజీగా ఉన్న హన్సిక తాజాగా ఒక వారం రోజుల పాటు షూటింగ్‌లకు దూరంగా తన చిన్న నాటి స్నేహితులతో జాలీగా గడపనుందట. విశేషం ఏమిటంటే ఈ బ్యూటీ ఈ వారం రోజులు న్యూయార్క్‌లో గడపడానికి రెడీ అవుతోంది. క్రిస్మస్‌తోపాటు నూతన సంవత్సరాన్ని ఈ భామ అక్కడే సెలబ్రేట్ చేసుకోనుందట. దీని గురించి ఈ మగువ తెలుపుతూ, నిజానికి తాను సంవత్సరం అంతా షూటింగ్‌లోనే గడపాలనుకుంటానని చెప్పింది. 
 
అయితే ఏడాదికోసారి విదేశాల్లో ఉన్న తన స్నేహితులతో సంతోషాన్ని పంచుకోవడానికి ఇష్టపడతానంది. ఈ ఏడాది తన ద్విభాషా చిత్రం బిరియాని విజయాన్ని ఎంజాయ్ చేయనున్నట్లు చెప్పింది. జనవరి తొలి వారంలో ముంబాయి తిరిగి వస్తున్నట్లు పేర్కొంది. తమిళం, తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్న హన్సిక తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న అరన్మణై చిత్రంలో వైవిధ్యభరిత పాత్రను పోషిస్తోందట. ఇది ప్రేమ కథా చిత్రం అయినా ఆమెకు పెయిర్ ఎవరూ ఉండరట. తానీ చిత్రంలో దేవుని బిడ్డగా నటిస్తున్నట్లు హన్సిక తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement