మరచిపోయిన ఆటతో... | gilli danda SHOOTING COMPLET | Sakshi
Sakshi News home page

మరచిపోయిన ఆటతో...

Dec 21 2017 1:42 AM | Updated on Dec 21 2017 1:42 AM

gilli danda SHOOTING COMPLET - Sakshi

నటరాజ్, రోనికా సింగ్‌ హీరో హీరోయిన్లుగా రష్మీ సినీ ప్రోడక్షన్స్‌ పతాకంపై ‘అరుంధతి’ శ్రీను దర్శకత్వంలో జె. వీరేష్‌ నిర్మిస్తున్న చిత్రం ‘గిల్లి దండా’ నలభై శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘క్రీడా నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. మా దర్శకుడు చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. నటుడు సత్యప్రకాశ్‌ కుమారుడు నటరాజ్‌ ఈ చిత్రం ద్వారా హీరోగా తెలుగుకు పరిచయం అవుతున్నారు. త్వరలో రెండో షెడ్యూల్‌ మొదలుపెట్టబోతున్నాం’’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘గిల్లి దండా ఆట ఈ తరం పిల్లలకు తెలియకపోవచ్చు. ఈ ఆట నేపథ్యంలో సాగే మంచి లవ్‌స్టోరీ ఇది. చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూశామనే ఫీల్‌ కలిగించేలా మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కుంచె రఘు, ఫైట్స్‌: థ్రిల్లర్‌ మంజు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement