 
															ఆ రూమర్లు నమ్మొద్దు: సల్మాన్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రూమర్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశాడు.
	ముంబయి: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రూమర్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశాడు. ఇంతకీ ఆ ఊకార్లు సల్లూభాయ్ పెళ్లి గురించి కాదులెండి. మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో చేసే సినిమా గురించి. అసలు విషయం ఏంటంటే... అక్షయ్ కుమార్ హీరోగా సల్మాన్ ఖాన్ నిర్మించబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు రానుంది. మరో విశేషం ఏంటంటే దర్శక, నిర్మాత కరణ్ జోహార్  కూడా ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం కానున్నాడు.
	
	అయితే ఈ ప్రాజెక్ట్ అటక ఎక్కినట్లు వచ్చిన వార్తలను సల్మాన్ తోసిపుచ్చాడు. నన్ను ఫాలో అవ్వండి కానీ...రూమర్లు ఫాలో కావద్దు అంటూ సల్మాన్ ఆదివారం ట్విట్ చేశాడు. అంతేకాకుండా అక్షయ్‌తో సినిమా చేసేందుకు తాను చాలా ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు.  కామెడి ఎంటర్ టైనర్గా తెరకెక్కే ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయాలని  సల్మాన్ ప్లాన్ చేస్తున్నాడు.
కాగా ఇంతకు ముందు 'హీరో' అనే చిత్రానికి సల్మాన్ నిర్మాతగా వ్యవహరించాడు. పంజాబీ దర్శకుడు అనురాగ్ సింగ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి పేరు ఖరారు చేయలేదు. గతంలో అనురాగ్ జట్ అండ్ జూలియట్, రఖ్వీబ్ చిత్రాలను డైరెక్ట్ చేశాడు.
Don't follow rumors . follow me . ek baar jo maine commitment kar di toh phir...... vry much doing film with @akshaykumar
— Salman Khan (@BeingSalmanKhan) 12 March 2017

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
