జీవితంలో అది ఉండాలి | Fatherhood changed NTR a lot: Kajal | Sakshi
Sakshi News home page

జీవితంలో అది ఉండాలి

Feb 12 2015 2:12 AM | Updated on Oct 30 2018 5:58 PM

జీవితంలో అది ఉండాలి - Sakshi

జీవితంలో అది ఉండాలి

కాజల్ అగర్వాల్ తన నట జీవితంలో మార్పు కోరుకుంటున్నారు...

కాజల్ అగర్వాల్ తన నట జీవితంలో మార్పు కోరుకుంటున్నారు. నటిగా దశాబ్దం కాలం పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్‌గా ప్రకాశిస్తున్న ఈ భామకీస్థాయి అంత సులభంగా రాలేదు. కాజల్ పయనం ఫ్లాప్‌లతోనే మొదలైంది. తమిళంలో తొలి రోజుల్లో బొమ్మలాటం, మోది విళైయాడులాంటి చిత్రాలు ఈ ఉత్తరాది బ్యూటీని చాలా నిరాశపరిచాయి. ఇంకా చెప్పాలంటే ఆ మధ్య నటించిన తుపాకీ వరకు కోలీవుడ్‌లో ఈ అమ్మడికి బిగ్ హిట్ లేదు.

అయితే టాలీవుడ్‌లో చందమామ చిత్రం తొలి ఆనందాన్ని నింపగా మగధీర చిత్రం స్థాయిని పెంచింది. ఆ తరువాత కమర్షియల్ హీరోయిన్‌గా ఎదుగుతూ వస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో ధనుష్ సరసన మాది చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో ఎన్‌టీఆర్‌తో నటించిన టెంపర్ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.

 
ఎన్‌టీఆర్ చాలా మారారు
టెంపర్ చిత్రంపై కాజల్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి అక్కడ కొత్త అవకాశాలేమీ లేవు. దీంతో టెంపర్ చిత్ర విజయం ఈమెకు చాలా అవసరం. అయితే టెంపర్ చిత్రంలో నటించడం చాలా మంచి అనుభవం అని కాజల్ పేర్కొన్నారు. ముఖ్యంగా కథానాయకుడు చాలా మారారని, నటనలోనూ పరిణితి పెరిగిందని కితాబిచ్చారు. వివాహానంతరం ఆయనలో మార్పు కనిపిస్తోందని, షూటింగ్‌లో కూడా కూతురు ముచ్చట్లే వల్లివేసేవారని చెప్పారు.
 
అరుంధతి ఆకట్టుకుంది
కథా నాయకి ఇతివృత్తంతో కూడిన చిత్రాలలో నటించాలని ఆశగా ఉందంది. ఆ తరహా కథా చిత్రాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నట్లు అన్నారు. మంచి కథలో బలమైన పాత్రలు నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు అన్నారు. అలాగని కమర్షియల్ చిత్రాల్లో నటించనని అర్థం కాదన్నారు. ఇటు కథా బలం ఉన్న పాత్రలకు అటు కమర్షియల్ చిత్రాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు.

నటి అనుష్క నటించిన అరుంధతి చిత్రం తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు.  అలాంటి కథా చిత్రాలు విజయవంతం అవుతున్నాయన్నారు. ప్రేక్షకుల్లో అభిమానం సంపాదించిన వారైతై హీరో, హీరోయిన్ అన్న బేధం లేకుండా ఆ తరహా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే అభిప్రాయాన్ని కాజల్ వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement