‘సంఘమిత్ర’ మొదలవుతోంది..!

Disha Patanti Starrer Sangamithra To Begin Soon - Sakshi

బాహుబలి సక్సెస్ తరువాత తమిళ చిత్ర వర్గాలు అదే స్థాయిలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. దర్శకుడు సుందర్‌.సి సంఘమిత్ర పేరుతో భారీ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్‌ చేశారు. ముందుగా టాప్‌ స్టార్స్‌తో సినిమా రూపొందించాలని ప్రయత్నించిన డేట్స్ అడ్జెస్ట్‌ కాకపోవటంతో జయం రవి, ఆర్య కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుందని ప్రకటించారు. టైటిల్‌ రోల్‌కు శృతి హాసన్‌ను ఎపింక చేసి కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో గ్రాండ్‌గా పోస్టర్స్‌ రిలీజ్ చేశారు.

కానీ కొద్ది రోజులకే శృతిహాసన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. దీంతో సంఘమిత్ర ఆగిపోయినట్టే భావించారు. కానీ తాజాగా సంఘమిత్ర చిత్రయూనిట్ షూటింగ్ ప్రారభించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. లోఫర్‌ ఫేం దిశా పటాని టైటిల్‌ రోల్‌లో సినిమాను తెరకెక్కించేందుకు సుందర్‌.సి రెడీ అవుతున్నారట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top