వెంకి కోసం దర్శకుల క్యూ | Directors waiting for victory venkatesh | Sakshi
Sakshi News home page

వెంకి కోసం దర్శకుల క్యూ

Sep 9 2015 11:35 AM | Updated on Sep 29 2018 5:17 PM

దృశ్యం లాంటి బిగ్ హిట్ సాదించిన తరువాత కూడా విక్టరీ వెంకటేష్ ఇంత వరకు సినిమా ఎనౌన్స్ చేయలేదు. వరుసగా మూడు హిట్స్ సాదించిన ఈ సీనియర్ హీరో నెక్ట్స్ సినిమా కథ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు...

దృశ్యం లాంటి బిగ్ హిట్ సాదించిన తరువాత కూడా విక్టరీ వెంకటేష్ ఇంత వరకు సినిమా ఎనౌన్స్ చేయలేదు. వరుసగా మూడు హిట్స్ సాదించిన ఈ సీనియర్ హీరో నెక్ట్స్ సినిమా కథ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. వెంకీ ఒకే అనాలే గాని వెంటనే సినిమా స్టార్ట్ చేయడానికి చాలా మంది దర్శకులు క్యూలో ఉన్నారు.


భలే భలే మొగాడివోయ్ సినిమాతో మంచి సక్సెస్ సాదించిన మారుతి, ఈ మధ్యే వెంకటేష్కు ఓ కథ వినిపించాడు. డైనమైట్ సినిమాతో నిరాశపరిచిన దేవాకట్ట కూడా వెంకటేష్ లీడ్ రోల్లో ఎమోషనల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రాంతి మాధవ్ కథను ఓకె చేసిన వెంకీ మరింత డెవలప్ చేయమని చెప్పాడు. వీరితో పాటు రచయితలుగా సక్సెస్ అయిన ఆకుల శివ, వీరుపోట్ల కూడా వెంకీ హీరోగా ఓ మూవీని డైరెక్ట్ చేయటం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

యువ హీరోలు కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే వెంకీ డేట్స్ కోసం మాత్రం దర్శకులు క్యూ కడుతున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, గోపాల గోపాల, దృశ్యం సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్లు సాదించిన వెంకటేష్తో సినిమా చేస్తే మినిమమ్ కలెక్షన్లు గ్యారెంటీ అని నమ్ముతున్నారు మేకర్స్. అంతేకాదు వెంకీ తో సినిమా అంటే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఉంది కనుక నిర్మాత సమస్య కూడా ఉండదన్న ఆలోచనలో ఉన్నారు దర్శకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement