‘ఈ నగరానికి ఏమైంది?’ మోషన్‌ పోస్టర్‌

Director Tarun Bhaskar Ee Nagaraniki Emaindi Motion Poster Released - Sakshi

పెళ్లి చూపులు మూవీతో చిన్న సినిమా స్టామినా ఏంటో నిరూపించాడు ఆ చిత్ర దర్శకుడు తరుణ్‌ బాస్కర్‌. తీసిన ఆ ఒక్క సినిమాతో పెద్ద సక్సెస్‌ సాధించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమా వచ్చి రెండేళ్లు గడుస్తున్నా... ఇంకో సినిమాను తెరకెక్కించలేదు ఈ యువ దర్శకుడు. 

ఈ నగరానికి ఏమైంది అంటూ సాగే ఒకప్పటి ఫేమస్‌ యాడ్‌లోని ఫస్ట్‌ లైన్‌ను తన సినిమా టైటిల్‌గా ఎంచుకున్నాడు. నీ గ్యాంగ్‌తో థియేటర్‌కు రా చూస్కుందాం అంటూ టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిగా రేకెత్తెలా చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ  మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంట్లో సినిమాలోని  నలుగురు కుర్రాళ్లను పరిచయం చేశాడు. మీరంతా గ్యాంగ్‌తో రండి... ఈ సమ్మర్‌లో మిమ్మల్ని గోవాకు తీసుకెళ్తాం అంటూ పోస్టర్‌ను రిలీజ్‌చేశారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలోనే  ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top