ప్రభాస్‌తో గొడవపై దర్శకుడి క్లారిటీ

Clarification On Clash Between Sujeeth And Prabhas - Sakshi

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న యంగ్ హీరో ప్రభాస్‌ ప్రస్తుతం మరో భారీ చిత్రంలో నటిస్తున్నాడు. రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈసినిమా షూటింగ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు.

గత కొద్ది రోజులు ప్రభాస్‌కు చిత్ర దర్శకుడు సుజిత్‌ కు మధ్య మనస్పర్థలు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. మేకింగ్ విషయంలో ప్రభాస్‌ సంతృప్తిగా లేడంటూ సాగుతున్న ప్రచారంపై సుజిత్‌ స్పందించారు. ఓ అభిమాని సోషల్‌ మీడియా ద్వారా అడిగిన ప్రశ్నకు బదులుగా ‘అలాంటిదేమీ లేదు గురువా! హై కిక్‌లో వర్క్‌ చేస్తున్నాం.. మధ్యలో ఇలాంటి న్యూస్‌  మాకు ఎంటర్‌టైన్మెంట్‌ అనుకో’ అంటూ ట్వీట్ చేశారు. ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top