టీనా గిఫ్ట్‌ : తీవ్ర ఉద్వేగానికి లోనైనా బోనీ | Boney Kapoor CRIED After Receiving Tina Ambani Gift In Sridevi Memory | Sakshi
Sakshi News home page

టీనా గిఫ్ట్‌ : తీవ్ర ఉద్వేగానికి లోనైనా బోనీ

Mar 9 2018 12:23 PM | Updated on Mar 9 2018 4:51 PM

Boney Kapoor CRIED After Receiving Tina Ambani Gift In Sridevi Memory - Sakshi

ముంబై : ప్రముఖ సినీనటి శ్రీదేవీ, టీనా అంబానీ మంచి స్నేహితులు. తరుచుగా వీళ్లిద్దరూ కలుస్తూనే ఉండేవారు. శ్రీదేవీ మరణించడానికి కొన్ని రోజులు ముందు అంటే ఫిబ్రవరి 11న టీనా బర్త్‌డే వేడుకల్లో వీరివురి కుటుంబాలు కలిసి సందడి చేశాయి. శ్రీదేవీ అకస్మాత్తుగా మరణించడంతో, బోని కపూర్‌ను టీనా పరామర్శించారు. ఈ సందర్భంగా తన 61వ పుట్టినరోజున శ్రీదేవీతో దిగిన ఓ ఫోటోను వెండి ఫ్రేమ్‌తో డిజైన్‌ చేయించి బోనీకి కానుకగా ఇచ్చారు. ఆ ఫోటోను చూసి బోనీ కపూర్‌ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారని తెలిసింది.

ఇదే శ్రీదేవితో కలిసి దిగిన ఆఖరి ఫొటో అవుతుందని అనుకోలేదని టీనా కూడా చాలా బాధపడ్డారట. తీవ్ర  ఉద్వేగంలోనే శ్రీదేవీ స్వీట్‌ మెమరీని తనకు కానుకగా ఇచ్చినందుకు బోనీ కృతజ్ఞతలు తెలిపారు. టీనా తన 61వ పుట్టినరోజు వేడుకను ముంబయిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు శ్రీదేవి, బోనీ కపూర్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా హాజరయ్యారు. భార్య శ్రీదేవి ఆకస్మిక మరణాన్ని బోనీ కపూర్‌ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని.. ఆయన్ని పరామర్శించడానికి వెళ్లిన వారంతా  బోనీ బాగా కుమిలిపోతున్నారని చెబుతున్నారు.  దుబాయ్‌లో మృతి చెందిన శ్రీదేవీ, మృతదేహాన్ని అంబానీకి చెందిన ప్రైవేట్‌ జెటే భారత్‌కు తీసుకొచ్చింది. 

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement