నవ్వులు పంచే పోలీస్‌ స్టేషన్‌ | bilalpur police station released on march | Sakshi
Sakshi News home page

నవ్వులు పంచే పోలీస్‌ స్టేషన్‌

Feb 6 2019 6:06 AM | Updated on Feb 6 2019 6:06 AM

bilalpur police station released on march - Sakshi

సాన్వీ మేఘనా, మాగంటి శ్రీనాథ్

మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా, గోరేటి వెంకన్న  కీలక పాత్రలో నటించిన చిత్రం ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’. నాగసాయి మాకం దర్శకత్వంలో ఎంఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై మహంకాళీ శ్రీనివాస్‌ నిర్మించిన ఈ సినిమా మార్చి రెండో వారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మహంకాళీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్యను ఇందులో చూపించాం. తప్పకుండా ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమా అవుతుంది. మంచి కథకు నిర్మాణ విలువలు తోడైతేనే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

పెద్ద నిర్మాణ సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా మా సినిమా ఉంటుంది. మార్చి రెండో వారంలో ఓ పెద్ద పంపిణీ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘బిలాల్‌పూర్‌ అనే ఊరి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే వింత వింత కేసులు కడుపుబ్బా నవ్విస్తాయి. కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునే సినిమా ఇది. ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా తెరకెక్కించాం. సినిమా చూస్తున్న వాళ్లకు తమ ఊరిలో జరిగే సంఘటనలు గుర్తొస్తాయి’’ అని నాగసాయి మాకం అన్నారు. ప్రణవి, ఆర్‌ఎస్‌ నందా, వెంకట్‌ గోవాడ, మల్లేష్, వైభవ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: తోట వి. రమణ, సంగీతం: సాబూ వర్గీస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement