సహజమైన కథ | Bilalpur Police Station Movie in to Post Production | Sakshi
Sakshi News home page

సహజమైన కథ

Jun 28 2018 12:16 AM | Updated on Jun 28 2018 12:16 AM

Bilalpur Police Station Movie in to Post Production - Sakshi

మేఘన, శ్రీనాథ్‌ మాగంటి

శ్రీనాథ్‌ మాగంటి, మేఘన జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో ఎమ్‌ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై మహంకాళి శ్రీనివాసులు నిర్మించిన సినిమా ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌’. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘‘పోలీస్‌స్టేషన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే వినూత్నమైన చిత్రం ఇది. ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు.

కథ మీద నమ్మకంతో దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా ఉన్నత నిర్మాణ విలువలతో చిత్రాన్ని నిర్మించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీనివాసులు. ‘‘వాస్తవ సంఘటనలతో అల్లుకున్న పూర్తి సహజమైన కథ ఇది. ప్రజా కవి గోరటి వెంకన్న ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. కామెడీ సన్నివేశాలు టైమింగ్‌కు తగ్గట్లుగా ఉంటాయి. సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నాగసాయి. ఈ సినిమాకు సంగీతం: సాబూ వర్గీస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement