
తొమ్మిదో వారంలో బిగ్‌బాస్ గట్టి షాక్ ఇచ్చాడు. డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంతవరకు ఎనిమిది వారాల్లో ఏడు ఎలిమినేషన్లు జరగ్గా.. ఒక వారం ఎలిమినేషన్ ప్రక్రియను రద్దు చేశాడు. అయితే ఈ తొమ్మిదో వారంలో అక్కడి లెక్కను ఈసారి డబుల్ ఎలిమినేషన్‌తో సరి చేసినట్టు కనిపిస్తోంది.
తొమ్మిదో వారానికి గానూ హిమజ, మహేష్, రాహుల్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక డబుల్ ధమాకా ఆఫర్ ఇచ్చిన బిగ్‌బాస్.. శనివారం ఒకర్ని, ఆదివారం మరొకర్ని ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. ఇక నేడు రాహుల్ ఎలిమినేట్ అయినట్టు నాగ్ ప్రకటించాడు. అయితే బయటకు వచ్చిన రాహుల్‌తో ఇదంతా ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. ఇదంతా బిగ్‌బాస్ ఆడించిన ఆట అంటూ... రాహుల్‌కు సీక్రెట్ రూమ్‌కు వెళ్లాలని తెలిపాడు. బిగ్‌బాస్ తదుపరి ఆదేశాల వరకు ఎదరుచూడాలని తెలిపాడు.