మరో టాలెంట్‌ చూపిస్తారట

Big Announcement! Dhanush’s second directorial begins today - Sakshi

ఇప్పటికే నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ధనుష్‌ తన మల్టీ టాలెంట్‌ను ప్రేక్షకులందరికీ చూపించారు. లేటెస్ట్‌గా తనలోని సంగీత దర్శకుడిని కూడా మనకు పరిచయం చేయడానికి రెడీ అయ్యారు. తన లేటెస్ట్‌ మూవీ ‘వడ చెన్నై’ ద్వారా ఈ కొత్త టాలెంట్‌ను పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నారాయణ్‌ తెలియజేశారు.

ధనుష్‌ పాడిన చాలా పాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. మరి సంగీత దర్శకుడిగా ఎన్ని మార్కులు వేయించుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే.. మరోవైపు పలు వాయిదాలు పడుతూ ఆగిపోతూ వస్తున్న ‘ఎన్నై నోక్కి పాయుమ్‌ తోట్టా’ సినిమా దసరా రేస్‌కు రెడీ అయింది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో ధనుష్, మేఘా ఆకాశ్‌ నటించిన ఈ చిత్రం, ‘వడ చెన్నై’ఒకే నెలలో విడుదల కానున్నాయి. సో.. అక్టోబర్‌ నెలలోనే ధనుష్‌ రెండుసార్లు థియేటర్స్‌లో సందడి చేస్తారన్నమాట.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top