కండలు పెంచేస్తూ కష్టపడుతోన్న కుర్రహీరో! | Bellamkonda Sreenivas Workouts Pictures Goes Viral | Sakshi
Sakshi News home page

Jan 20 2019 3:34 PM | Updated on Aug 3 2019 12:45 PM

Bellamkonda Sreenivas Workouts Pictures Goes Viral - Sakshi

ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు యువ హీరో బెల్లకొండ శ్రీనివాస్‌. రీసెంట్‌గా కవచం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోకు ఈ మూవీ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. పట్టువదలని విక్రమార్కుడిలా విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 

తాజాగా ఈ హీరో జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ కష్టపడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. సిక్స్‌ ప్యాక్‌తో అదరగొడుతున్న ఈ ఫోటోల్లో స్టైలీష్‌గా ఉన్నాడు. రమేష్‌ వర్మతో చేయబోయే సినిమాకోసం బాడీని బిల్డప్‌ చేస్తున్నాడట. ఈ హీరో ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement