సూపర్‌ స్టార్‌ను ఎగిరి తన్నాడు! | Arnold Schwarzenegger kicked during sporting event in South Africa | Sakshi
Sakshi News home page

సూపర్‌ స్టార్‌ను ఎగిరి తన్నాడు!

May 19 2019 12:55 PM | Updated on May 19 2019 1:13 PM

Arnold Schwarzenegger kicked during sporting event in South Africa - Sakshi

హాలీవుడ్ సూపర్‌ స్టార్‌, కాలిఫోర్నియా మాజీ గవర్నర్‌ ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌కు చేదు అనుభవం ఎదురైంది. సౌత్‌ ఆఫ్రికా, జోహెన్స్‌ బర్గ్‌లో జరుగుతున్న ఓ స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌కు హాజరైన ఆర్నాల్డ్‌ ను ఓ వ్యక్తి వెనకు నుంచి బలంగా తన్నాడు. క్రీడాకారులు స్కిప్పింగ్ ఆడుతుండగా ఆర్నాల్డ్‌ అక్కడ ఉన్న అభిమానులతో సెల్పీలు దిగేందుకు ముందుకు వచ్చాడు.

ఆ సమయంలో ఆకస్మాత్తుగా ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆర్నాల్డ్‌ ను బలంగా తన్నాడు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే అతడికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించిన ఆర్నాల్డ్ వీడియోలో చూసే వరకు తనను వెనుక నుంచి ఓ వ్యక్తి తన్నిన విషయం తెలియదని.. కేవలం అక్కడున్న వారు తోపులాటలో తన మీద పడ్డారని భావించానని తెలిపారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement