పక్షుల కోసం పాట

AR Rahman collaborates with Bollywood singer Kailash Kher for 2.0 - Sakshi

పక్షుల అంతరంగం ఎలా ఉంటుంది? వాటిని బాగా ప్రేమించేవాళ్లకు కొంత అర్థం అవుతుంది. అక్షయ్‌ కుమార్‌ కూడా పక్షి ప్రేమికుడు. టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ కొన్ని పక్షుల అంతానికి కారణం అవుతోందని రగిలిపోతాడు. తన కోపాన్ని పాట రూపంలో ప్రతిబింబించాలనే ఆకాంక్షతో ఓ పాట పాడారట. ఆ పాటను కైలాష్‌ ఖేర్‌ పాడారు. ఇదంతా ‘2.0’ సినిమా గురించే. రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్‌ ముఖ్య తారలుగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘2.0’. ఈ చిత్రానికి ఏఆర్‌. రెహమాన్‌ స్వరకర్త.

ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘యందిరిన్‌’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు సీక్వెల్‌ ఇది. ఈ సినిమాలో బర్డ్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సాంగ్‌ను సింగర్‌ కైలాష్‌ ఖేర్‌ పాడారు. ప్రభాస్‌ నటించిన ‘మిర్చి’లో ‘పండగలా దిగివచ్చాడు’, మహేశ్‌ నటించిన ‘భరత్‌ అనే నేను’లో ‘వచ్చాడయ్యో సామీ’ సాంగ్స్‌ను పాడింది కైలాష్‌నే. ‘‘వన్‌ అండ్‌ ఓన్లీ రెహమాన్‌ సారథ్యంలో ‘2.0’ మూవీ కోసం ఓ బ్యూటిఫుల్‌ బర్డ్‌ సాంగ్‌ పాడా’’ అని పేర్కొన్నారు కైలాష్‌ ఖేర్‌. ‘2.0’ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
∙కైలాష్‌ఖేర్, ఏఆర్‌ రెహమాన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top