‘ఇప్పుడు మిగతా ఐదుగుర్ని వెతకాలి’ | Anushka Sharama Reacts to Her Uncanny Resemblance Julia Michaels | Sakshi
Sakshi News home page

‘ఇప్పుడు మిగతా ఐదుగుర్ని వెతకాలి’

Feb 6 2019 11:59 AM | Updated on Apr 4 2019 3:20 PM

Anushka Sharama Reacts to Her Uncanny Resemblance Julia Michaels - Sakshi

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో అనుష్క శర్మ, అమెరికన్‌ సింగర్‌ జూలియా మైకేల్స్‌ ఫోటోలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దాంతో నెటిజన్లు వీరిద్దరి ఫొటోలను పక్కపక్కన పెట్టి ‘అనుష్కా.. నీకు చెల్లి ఉందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఫొటోను అనుష్క, జూలియాలు కూడా చూశారు.

దాంతో జూలియా వెంటనే అనుష్కకు ట్విటర్‌లో ఈ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘హై అనుష్క.. మనమిద్దరం కవలలమట..’ అని సరదాగా మెసేజ్‌ పెట్టారు. అందుకు అనుష్క స్పందిస్తూ.. ‘ఓ మై గాడ్‌ నిజమే! నువ్వు కనిపించావు. ఇప్పుడు నాలా ఉన్న మరో ఐదుగురి కోసం వెతకాలి’ అంటూ సరదగా రిప్లై ఇచ్చారు అనుష్క. వీరిద్దరి మధ్య జరిగిన ట్విటర్‌ సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement