పెళ్లికి స్టార్ హీరోను ఆహ్వానించని అనుష్క! | Anushka not invites Salman Khan and reasons goes viral | Sakshi
Sakshi News home page

పెళ్లికి స్టార్ హీరోను ఆహ్వానించని అనుష్క!

Dec 10 2017 4:52 PM | Updated on Dec 10 2017 9:36 PM

Anushka not invites Salman Khan and reasons goes viral - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మల పెళ్లి అంటూ ప్రచారం జరగగా.. రోజుకో అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరి పెళ్లిని ఇరు వర్గాలు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. కానీ ఏర్పాట్లు మాత్రం జరిగిపోతున్నాయని.. విరుష్క జోడీ, కుటుంబ సభ్యులు ఇటలీలో ఉన్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. బాలీవుడ్ ఖాన్‌ త్రయంలో ఒకరికి ఈ మెగా ఈవెంట్‌కు ఆహ్వానం అందలేదట. ఇండస్ట్రీలో ఈ విషయం హల్‌చల్ చేస్తోంది.

బాలీవుడ్ ఖాన్ త్రయం అంటే.. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌లు. కాగా, వీరి ముగ్గురి సరసన అనుష్క నటించింది. అయితే షారుక్, ఆమిర్ లను ఆహ్వానించిన అనుష్క ఫ్యామిలీ కండలవీరుడు సల్మాన్‌ను మాత్రం పిలవలేదన్న టాక్ వినిపిస్తోంది. అదే కారణమంటూ కొన్ని వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సల్మాన్, అనుష్కలు సుల్తాన్‌ మూవీ కోసం కలిసి పనిచేయగా.. ఆ మూవీ సెట్‌లో సల్మాన్ గంభీరంగా ఉండేవాడట. తనకు సినిమాలో మాత్రం సల్మాన్ తెలుసునని, బయట అతడేంటో తెలియదని గతంలో అనుష్కనే స్వయంగా చెప్పడమూ కారణాలేనని ఇండస్ట్రీలో టాక్. వీరి మధ్య క్లోజ్ రిలేషన్ లేని కారణంగా ఆహ్వానించలేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ 12న విరుష్కల జోడీ వివాహ బంధంతో ఒక్కటవనుందని, డిసెంబర్ నెలాఖర్లో గ్రాండ్ రిసెస్పన్ ఉంటుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement