అలా అంటే అబద్ధమే! | Amalapaul Entry In Bollywood Soon | Sakshi
Sakshi News home page

అలా అంటే అబద్ధమే!

Aug 28 2018 9:43 AM | Updated on Apr 3 2019 6:34 PM

Amalapaul Entry In Bollywood Soon - Sakshi

అందరి దారి వేరు, నా దారి వేరు అని కచ్చితంగా చెప్పే నటి అమలాపాల్‌

తమిళసినిమా: అందరి దారి వేరు, నా దారి వేరు అని కచ్చితంగా చెప్పే నటి అమలాపాల్‌. సగటు మహిళ మాదిరి జీవించడం నా వల్ల కాదు అని కుండ బద్దలు కొట్టినట్లు చేప్పే అమలాపాల్‌ మాతృభాష మలయాళంలో నటిగా పరిచయం అయినా, కోలీవుడ్‌లోనే నటిగా బాగా పాపులర్‌ అయ్యింది. ఆ అమ్మడి నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం మైనా. ఆ తరువాత వెంట వెంటనే విక్రమ్, విజయ్, ధనుష్‌ అంటూ స్టార్‌ హీరోలతో జత కట్టే అవకాశాలను కొట్టేసి స్టార్‌ హీరోయిన్‌ అంతస్తును దక్కించుకుంది. అదే విధంగా తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా బాలీవుడ్‌ రంగప్రవేశానికి రెడీ అవుతోంది.  అమలాపాల్‌ త్వరలో హింది చిత్రంలో నటించనుంది.

ఇలా దక్షిణాదిలో నటిగా గుర్తింపు పొంది బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్న అమలాపాల్‌ను ప్రేమ, పెళ్లి, వివాహరద్దు నుంచి సులభంగానే బయట పడినట్టేనా? అని అడగ్గా వాటి వల్ల ఎలాంటి బాధింపు లేదంటే అది పచ్చి అబద్ధమే అవుతుందని బదులిచ్చింది. బాధ లేకుండా జీవించగలమని తాను చెప్పనంది. అయితే ఎలాంటి సమస్య ఎదురైనా ఆ బాధ నుంచి రెండు రోజుల్లో బయట పడి తదుపరి పనికి ఉపక్రమించకుంటే జీవితంలో ముందుకు సాగలేమని అంది. తాను ఇప్పుడు శాకాహారానికి మారానని ఇదే తనకు ఆరోగ్యకరంగా ఉందని చెప్పుకొచ్చింది. జిమ్‌లో వర్కౌట్స్, యోగా, ధ్యానం అంటూ నిత్యం ఆరోగ్య సూత్రాలను తూచ తప్పకుండా పాటిస్తున్నానని తెలిపింది. జీవితం చాలా నేర్పుతుందని, వాటిలో మనకు కావలసింది తీసుకోవాలని అంది. ప్రస్తుతం నటనపై పూర్తి శ్రద్ధ చూపుతున్న ఈ అమ్మడు తాజాగా బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం ఎలా అన్న విషయాల గురించి అనుభవజ్ఞులను అడిగి తెలుసుకునే పనిలో పడిందట.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement