అల్లు అరవింద్‌ డాన్స్‌ అదుర్స్‌ | Allu Arvind Dance in Prati Roju Pandage Pre Release Event | Sakshi
Sakshi News home page

‘ప్రతిరోజూ పండగే’ ప్రీ రిలీజ్ సందడి

Dec 16 2019 1:50 PM | Updated on Dec 16 2019 2:40 PM

Allu Arvind Dance in Prati Roju Pandage Pre Release Event - Sakshi

నిర్మాత అల్లు అరవింద్‌ తన డాన్స్‌తో వారెవా అనిపించారు.

సాక్షి, హైదరాబాద్‌: సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం సందడిగా జరిగింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లో జరిగిన ఈ వేడుకలో నటీనటులు, సాంకేతిక నిపుణులు సందడి చేశారు. నటీనటులతో పాటు నిర్మాత అల్లు అరవింద్‌ డాన్స్‌ చేసి అందరినీ అలరించారు. సాయిధరమ్ తేజ్ స్వయంగా ఆయనను వేది​క మీదకు తీసుకెళ్లి డాన్స్‌ చేయాలని కోరారు. సీనియర్‌ నటుడు సత్యరాజ్‌తో కలిసి హుషారుగా వేదికపై స్టెప్పులేశారు. మరో నిర్మాత బన్నీ వాసు కూడా హీరో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నృత్యం చేశారు. ‘తకిట తథిమి’ పాటకు హీరో, హీరోయిన్లతో పాటు మిగతా నటులు కూడా డాన్స్‌ చేయడంతో సందడి వాతావరణం నెలకొంది.

మారుతి దర్శకత్వం తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌కుమార్‌, నరేశ్‌, రావురమేశ్‌, ప్రభ ముఖ్యపాత్రల్లో నటించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అభిమానులను అలరిస్తున్నాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement