ఒక్క పోస్ట్‌తో సమాధానం చెప్పిన బన్నీ | Allu Arjun Posts His Sons Pic About Rangasthalam In Facebook  | Sakshi
Sakshi News home page

ఒక్క పోస్ట్‌తో సమాధానం చెప్పిన బన్నీ

Mar 22 2018 1:39 PM | Updated on Jul 14 2019 1:57 PM

Ayaan In Ramcharan Getup - Sakshi

మామ రాంచరణ్‌ గెటప్‌లో అయాన్‌

మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు మధ్య దూరం పెరిగిందనీ, అందుకే చెర్రీ కొత్త సినిమా రంగస్థలంపై కామెంట్‌ చేయడం లేదని సోషల్‌మీడియాలో బన్నీపై రూమర్స్‌ వచ్చాయి. పైగా సుకుమార్‌, అల్లు అర్జున్‌లు కూడా స్నేహితులే. అయినా కనీసం ఒక్క ట్వీట్‌ కూడా చేయడం లేదేంటని మెగా అభిమానులు తెగ ఆవేదన చెందారు. నిజంగానే బన్నీకి, చెర్రీకి దూరం పెరిగిందేమో అనుకుంటుంటే.. బన్నీ వీటన్నింటికి ఒకే ఒక పోస్ట్‌తో సమాధానం చెప్పాడు. 

మెగా హీరోలందరు రంగస్థలం సినిమాపై కామెంట్‌ చేశారు. కానీ, బన్నీ మాత్రం తన తనయుడు అయాన్‌కు చిట్టిబాబు గెటప్‌ వేసి ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఫోటోతో పాటు రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. ఎంత సక్కగున్నవ్‌.. అంటూ రంగస్థలంలోని పాటలతో చిట్టిబాబు గెటప్‌లో ఉన్న తనయుడిని పొగిడాడు. దీంతో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయని మెగా అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement