‘ఇండియా కావాలి.. ఇచ్చెయ్‌’ | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 28 2018 12:00 PM

Allu Arjun Naa Peru Surya Naa Illu India Theatrical Trailer - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు. మే 4న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. సినిమాలో బన్నీ క్యారెక్టరైజేన్‌ను రివీల్ చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్‌లో సినిమాలోని ఇతర కీలక పాత్రధారులని పరిచయం చేశారు.

అల్లు అర్జున్‌ సరసన అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శరత్‌కుమార్‌, బొమన్‌ ఇరానీ, నదియాలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాతో మరోసారి ఘనవిజయం సాధిస్తాడని నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్‌.

Advertisement
 
Advertisement