హీరోలకు సమ్మర్ సెలవులు | Allu Arjun, Mahesh babu and pawan kalyan next project detail | Sakshi
Sakshi News home page

హీరోలకు సమ్మర్ సెలవులు

May 21 2016 1:21 PM | Updated on Mar 22 2019 5:33 PM

హీరోలకు సమ్మర్ సెలవులు - Sakshi

హీరోలకు సమ్మర్ సెలవులు

సమ్మర్ హీట్ను మరింత పెంచిన స్టార్ హీరోలు ఇప్పుడు హాలీడే మూడ్లో ఉన్నారు. తమ భారీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నెలల తరబడి కష్టపడిన స్టార్స్, ఇప్పుడు తమ...

సమ్మర్ హీట్ను మరింత పెంచిన స్టార్ హీరోలు ఇప్పుడు హాలీడే మూడ్లో ఉన్నారు. తమ భారీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నెలల తరబడి కష్టపడిన స్టార్స్, ఇప్పుడు తమ సమయాన్ని కుటుంబాల కోసం కేటాయిస్తున్నారు. అందుకే నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేసే ముందు చిన్న గ్యాప్ తీసుకొని ఎక్కువ సమయాన్ని ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. ఈ సమ్మర్లో అందరికంటే ముందే బరిలో దిగిన సర్దార్ గబ్బర్సింగ్ సినిమా రిజల్ట్ను పక్కన పెట్టేసి పవన్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ లో ఉన్నాడు.

ఇక సమ్మర్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన అల్లు అర్జున్ కూడా నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేయడానికి టైం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సరైనోడు సినిమా కోసం ఏడాది పాటు కష్టపడిన బన్నీ, ఇప్పుడు పూర్తి సమయాన్ని ఫ్యామిలీతోనే గడుపుతున్నాడు. ఈ శుక్రవారం బ్రహ్మోత్సవం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాడు. తన ప్రతీ సినిమా తరువాత ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లే ప్రిన్స్, ఈ సారి కూడా అదే ప్లాన్లో ఉన్నాడు.

ఈ హాలీడేస్ ముగిశాకే మన స్టార్ హీరోలు చేయబోయే తదుపరి చిత్రాల మీద క్లారిటీ రానుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన నెక్ట్స్ సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు. ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టడమే తరువాయి. మహేష్ కూడా మురుగదాస్తో సినిమా అని కన్ఫామ్ చేశాడు. మరో రెండు నెలల్లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. బన్నీ మాత్రం తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. విక్రమ్ కుమార్, లింగుసామి లాంటి డైరెక్టర్లు లైన్లో ఉన్నా ఎవరితో సినిమా అన్నది కన్ఫామ్ చేయలేదు. ఈ హాలీడే మూడ్ నుంచి బయటకి వచ్చాక నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement