‘సైరా’పై బన్నీ ఆసక్తికర కామెంట్స్

తొలి స్వతంత్ర్య సమరయోధుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులే కాక.. తెలుగు ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ మూవీపై స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కామెంట్స్ చేశారు. తన సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న బన్నీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా రాలేకపోయాడు. దీంతో సైరాపై తనదైన స్టైల్లో స్పందించాడు. ‘సైరా.. నరసింహారెడ్డి.. మన మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వస్తోన్న అద్భుతమైన చిత్రం. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో ఆయన నటించాలని.. మగధీర సినిమాను చూసినప్పటి నుంచీ అనుకున్నాను. ఆ కోరిక నేటితో నిజమైంది. చిరంజీవి గారితో ఇలాంటి సినిమా తీసిన నిర్మాత, మై డియర్ బ్రదర్ రామ్ చరణ్‌కు థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్.
ఓ తండ్రికి కొడుకు ఇవ్వగల గొప్ప బహుమతి ఇది. ఆయన లెగసీకి ఇదో నివాళి. చిత్రానికి పని చేసిన ప్రతిఒక్కరికీ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ సురేందర్‌రెడ్డికి నా తరుపున స్పెషల్ రెస్పక్ట్. మన హృదయంలోఎప్పటికీ మరిచిపోలేని మ్యాజిక్‌ను ఈ మూవీ క్రియేట్ చేయాలని, సైరా అంటూ నిత్యం మన గుండెల్లో వినిపించాలని కోరుకుంటున్నా’ అంటూ సోషల్ మీడియా ద్వారా సైరాపై తనకున్న ప్రేమను వెల్లడించారు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, నయనతార, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ మూవీ విడుదల కానుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి