హీరో అక్షయ్ కు చేదు అనుభవం | Akshay Kumar detained at Heathrow airport | Sakshi
Sakshi News home page

హీరో అక్షయ్ కు చేదు అనుభవం

Apr 7 2016 9:46 AM | Updated on Sep 3 2017 9:25 PM

హీరో అక్షయ్ కు చేదు అనుభవం

హీరో అక్షయ్ కు చేదు అనుభవం

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్కు చేదు అనుభవం ఎదురైంది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం తను హీరోగా నటిస్తున్న పిరియాడిక్ మూవీ 'రుస్తుం' కోసం లండన్ వెళ్లిన అక్షయని అక్కడి హెత్రో ఎయిర్ పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమ దేశంలోకి అడుగుపెట్టడానికి కావాల్సిన పత్రాలు సరిగా లేవంటూ ఆయనను గంటన్నర పాటు ఎయిర్పోర్ట్లోనే ఉంచేశారు. ఈ సమయంలో అక్షయ్తో పాటు వ్యక్తిగత సహాయకుడు కూడా ఉన్నారు.
 
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2 షూటింగ్ షెడ్యూల్ ముగించుకొన్న అక్షయ్, రుస్తుం షూటింగ్ కోసం మంగళవారం లండన్ బయలుదేరారు. బుధవారం ఉదయానికి లండన్ చేరుకున్న అక్షయ్ని ఎయిర్పోర్ట్లోనే గంటన్నర పాటు నిలిపివేశారు. ఈ సమయంలో సాధారణ ప్రయాణికులతో పాటే అక్షయ్ని కూడా ఉండమనటం హీరోను మరింత అసహనానికి గురిచేసింది. అభిమానులు ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీల కోసం ఇబ్బంది పెడుతున్నారని, ఎక్కడైన ప్రైవేట్ ప్లేస్లో వెయిట్ చేయడానికి అనుమతించాలని అక్షయ్ కోరినా, ఎయిర్ పోర్ట్ అధికారులు అంగీకరించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement